అధికారులను సన్మానించిన నూతన సర్పంచ్

★ రాగాయిపల్లి సర్పంచ్ సామ వెంకటయ్య

పయనించే సూర్యుడు, డిసెంబర్ 30 2025, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం మండల ప్రజా పరిషత్ అధికారులను సర్పంచ్ సామ వెంకటయ్య సన్మానించారు. సోమవారం కల్వకుర్తి ఆర్డీవో జనార్దన్ రెడ్డి, వెల్దండ మండల తాసిల్దార్ కార్తీక్ కుమార్, ఎంపీడీవో సత్యపాల్ రెడ్డిలను మండల పరిధిలోని రాగాయపల్లి గ్రామ సర్పంచ్ స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన సందర్భంగా మండల అధికారులకు శాల్వాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సర్పంచ్ అంటే ఎంతో ఉన్నతమైన పదవి అని బాధ్యతాయుతంగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం సర్పంచి సామ వెంకటయ్య మాట్లాడుతూ గ్రామ పరిపాలనలో ఏమైనా లోటు, పాట్లు ఉన్నట్లయితే వాటిని సవరించే దిశగా అధికారులు దిశా నిర్దేశం చేయాలని ఆయన అధికారులను కోరారు. ఈ సమావేశంలో సింగిల్ విండో డైరెక్టర్ నాగులు నాయక్, గ్రామస్తులు పాల్గొన్నారు.