అన్నారుగూడెం తెలుగు బాప్టిస్ట్ చర్చిలో ఘనంగా జరిగిన క్లెమెంట్ మనోహర్ జన్మదిన వేడుకలు

★ ఆశీస్సులు అందించిన సీనియర్ పాస్టర్ మేకల ప్రసాదరావు

పయనించే సూర్యుడు న్యూస్ : డిసెంబర్ 30, తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామానికి చెందిన ఇస్నపల్లి బాబురావు వరలక్ష్మి దంపతుల కుమారుడు చిరంజీవి ఇస్నపల్లి క్లెమెంట్ మనోహర్ జన్మదిన వేడుకలు అన్నారుగూడెం గ్రామంలో స్థానిక తెలుగు బాప్టిస్ట్ చర్చి నందు పాస్టర్ మేకల ప్రసాదరావు ప్రార్థనతో ఘనంగా జరిగింది. పాస్టర్ మేకల ప్రసాద రావు ఆదివారం ఉదయం చర్చిలో క్లెమెంట్ మనోహర్ చేత కేక్ కట్ చేయించి పిల్లలకు స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పిల్లలు మరియు స్థానికులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా క్లెమెంట్ మనోహర్ కు పలువురు చరవాణి ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. తల్లాడ మట్టమ్మ హోటల్ యజమాని సరికొండ అప్పలరాజు, అన్నారుగూడెం సర్పంచ్ గొడ్ల ప్రభాకర్, మల్లారం ఉప సర్పంచ్ యశోదా శ్రీనివాసరావు,తల్లాడ మీసేవ నిర్వాహకులు గొల్లమందల రవీంద్రబాబు, దుప్పటి రాజు, పూర్ణ కంటి నాగేశ్వరరావు, ఇసనపల్లి బాబు, లోకయ్య, కృష్టార్జున్ రావు, షేక్ సలీం, జర్నలిస్ట్ గొడ్ల నరసింహారావు, వరపర్ల కిషోర్, మేడి యాకూబ్, గొడ్ల శ్రీనివాసరావు, గొడ్ల మురళి తదితరులు క్లెమెంటుకు చరవాణి ద్వారా శుభాకాంక్షలు అందజేశారు.