అర్జీలుసకాలంలోపరిష్కరించాలి,ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

★ 146 దరఖాస్తుల రాక

పయనించే సూర్యుడు, డిసెంబర్ 30 రాజన్న సిరిసిల్ల జిల్లా (స్టాఫ్ రిపోర్టర్ ఎమ్. ఎ. షకీల్ ) ప్రజావాణి అర్జీలు సకాలంలో పరిష్కరించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లా సిరిసిల్ల సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్బంగా ఇంచార్జి కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. మొత్తం దరఖాస్తులు 146 వచ్చాయి. రెవెన్యూ శాఖకు సంబంధించి 69, జిల్లా పంచాయతీ అధికారి, గృహ నిర్మాణ శాఖకు 13 చొప్పున, ఉపాధి కల్పన అధికారికి 9, ఎండీ సెస్ 8, జిల్లా సంక్షేమ శాఖ అధికారి, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్లకు 4చొప్పున, జీజీహెచ్ సూపరింటెండెంట్, డీసీఎస్ఓ డీఈఓ, నీటి పారుదల శాఖకు 2 చొప్పున, సీపీఓ, డీఏఓ, ఈఈ పీఆర్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, ఎంపీడీఓ ముస్తాబాద్, వేములవాడ, ఎల్లారెడ్డిపేట, డీఆర్డీఓ, డీఎస్ సీడీఓ, డీటీఓ, డీవైఎస్ఓ, లీడ్ బ్యాంక్ మేనేజర్, మున్సిపల్ కమిషనర్ వేములవాడ, ఎస్పీ, జడ్పీ ఆఫీస్, ఎస్డీసీకి ఒకటి చొప్పున వచ్చాయి. ఈకార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత తదితరులు పాల్గొన్నారు.