ఆదోని జిల్లా కోసం 44వ రోజు గంగపుత్ర సంఘం దీక్ష

పయనించే సూర్యుడు డిసెంబర్ 30 డివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి ఆదోని జిల్లా కావాలని మరి జేఏసీ వారి ఆధ్వర్యంలో ఈ రోజు ఆదోని గంగపుత్ర సంఘం 44 వ రోజున దీక్షలో కూర్చోవడం జరిగింది స్థానిక గంగమ్మ గుడి దేవాలయం నుంచి పాదయాత్ర చేస్తూ భీమా సర్కిల్ వరకు పాదయాత్ర చేస్తూ దీక్షలో కూర్చోవడం జరిగింది ఎమ్మిగనూరు బెస్త గంగపుత్ర సంఘం నాయకులు ఆదోని బెస్త గంగపుత్ర సంఘం వారికి మద్దతు తెలిపారు మరియు ఆలూరు తాలూకా బెస్త గంగ పుత్ర సంఘం అధ్యక్షులు బెస్త గోవిందరాజులు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు ఆదోని జిల్లా కావాలనీ మా సంఘం తరుపున సంపూర్ణ మద్దతు ప్రకటించారు గంగపుత్రుల దీక్షకు మద్దతుగా పెద్ద హరివనం గ్రామస్తులు పెద్ద ఎత్తున సంఘీభావం తెలపడం జరిగింది కురువ కార్పోరేషన్ రాష్ట్ర చైర్మన్ దేవేంద్ర గంగపుత్ర సంఘం వారికి దీక్షకు సంపూర్ణ మద్దతు పలికారు కార్యక్రమంలో బెస్త కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ రామాంజనేయులు సంపూర్ణ మద్దతు పలికారు అలాగే సామాజిక కార్యకర్త సాయిఫణి సంఘీభావం తెలపడం జరిగింది ఈ కార్యక్రమం సిపిఐ వీరేష్ జై భీమ్ సాయిరాం మరియు ఇతర కుల సంఘాల నాయకులు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు అందరూ పాల్గొన్నారు