ఆదోని జిల్లా సాధనకై కదం తొక్కిన విద్యార్థి లోకం

★ అడుగు అడుగున పోలీసుల ఆంక్షలను దాటుకుని కర్నూలు కలెక్టరేట్ ముట్టడి విజయవంతం

పయనించే సూర్యుడు డిసెంబర్ 30, ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. కర్నూలు నగరంలో ఆదోని జిల్లా సాధన విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ నుండి విద్యార్థులు భారీ ఎత్తున జై ఆదోని నినాదాలతో, విద్యార్థులు అర్ధనగ్న ప్రదర్శన ర్యాలీగా కర్నూలు కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం విద్యార్థి సంఘాల జేఏసీ నేతలు కలెక్టర్ కి వినతిపత్రాన్ని అందజేయడానికి వెళుతుండగా పోలీసులు అడ్డుకోవడంతో విద్యార్థులు పోలీసులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం జిల్లా కలెక్టర్ ని కలిసి ఆదోని జిల్లా ఏర్పాటు చేసి ఈ ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని వినతిపత్రాన్ని అందజేశారు.