ఆశాల వర్కర్ల అక్రమ అరెస్టులను ఖండిద్దాం

పయనించే సూర్యుడు, డిసెంబర్ 30 2025, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి నియోజకవర్గం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రంలో ఆశ వర్కర్ల ను. ముందస్తు అరెస్టు చేయడం జరిగింది. సోమవారం వెల్దండ మండల కేంద్రంలో ఆశా వర్కర్లు ను ఉదయం 4 గంటలకు ఆశా కార్యకర్తలు ఇండ్ల దగ్గరకు వెళ్లి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ముందస్తు అరెస్టుల పేరుతో అరెస్టులు చేయడం అన్యాయం అన్నారు. రాష్ట్రంలో ఎలాంటి పిలుపులు లేకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి అరెస్టు చేయడం సరైనది కాదన్నారు. ముందస్తు అక్రమ అరెస్టులను సిఐటియు జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ఆశా కార్యకర్తలు ఇండ్ల దగ్గరికి వచ్చే పోలీసులను నిలదీయాలని మాకు ఎలాంటి పిలుపులు లేవు మేము రాము అని కచ్చితంగా చెప్పండి కార్యకర్తలకు తెలియజేశారు. ఇప్పటికే వెల్దండ, అచ్చంపేట, పెద్ద కొత్తపల్లి పరిధిలో అరెస్టులు జరుగుతున్నాయని, మిగతా చోట్ల అరెస్టు కాకుండా పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ముందస్తు అరెస్ట్ అయిన వారిలో బాలమణి, సుజాత, పద్మ, యాదమ్మ, సునీత లు ఉన్నారు