పయనించే సూర్యుడు 30-12-2025 ఎన్ రజినీకాంత్:- హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఇంద్రనగర్ సర్పంచ్ అంబాల రాజ్ కుమార్ తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న అంబేద్కర్ సంఘం రాష్ట్ర నాయకులు సోమవారం సర్పంచ్ అంబాల రాజ్ కుమార్ కుటుంబాన్ని వారి నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుడు అంబాల మొగులయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ధైర్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముల్కనూర్ గ్రామం మాజీ ఉపసర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహనీయుల జయంతోత్సవ కమిటీ చైర్మన్ కొలుగూరి రాజు, అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి కండె సుధాకర్, బీసీ నాయకులు వేముల జగదీష్ పాల్గొన్నారు.