ఉచితంగా డీఎస్సీ సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచితంగా ఆన్లైన్ పరీక్షలు

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 30 అరకులోయ టౌన్ రిపోర్టర్ టి నీలకంఠం అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గ అరకు వ్యాలీ మండల పరిధిలో పీసీ, ఎస్‌ఐ మరియు డీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచితంగా ఆన్‌లైన్ కోచింగ్ అందించేందుకు అరకు వ్యాలీ పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా అరకు వ్యాలీ మండలం నుండి దరఖాస్తులు స్వీకరించి, సుమారు 150 మంది అభ్యర్థులకు అరకు పోలీస్ స్టేషన్ గ్రౌండ్‌లో ఎంపిక పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అరకు వ్యాలీ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ శ్రీ జి. గోపాలరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందస్తుగా కాకినాడకు చెందిన శ్యామ్ ఇన్‌స్టిట్యూట్ వారితో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, ఎంపికైన అభ్యర్థులకు త్వరలోనే ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ అందించనున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఈ రోజు జరిగిన పరీక్షకు హాజరైన అభ్యర్థులు, అరకు వ్యాలీ పోలీస్ వారు కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ లక్ష్య సాధనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. పోలీస్ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల గ్రామీణ ప్రాంత యువతకు ఎంతో మేలు చేకూరుతుందని అభ్యర్థులు అభిప్రాయపడ్డారు.