పయనించే సూర్యుడు డిసెంబర్ : 30 జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జి కె సాయి దుర్గ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం స్థానిక ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో గత నాలుగున్నర సంవత్సరాలుగా దాతల సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత అన్న క్యాంటీన్ కు ఈ వారం జగ్గంపేట మండలం రాజపూడి గ్రామానికి చెందిన కీర్తిశేషులు జామి రాంబాబు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల ఆర్థిక సాయంతో పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రేఖా బుల్లి రాజు మాట్లాడుతూ అన్ని దానాల కన్నా గొప్పదానం అన్నదానం అని ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నా క్యాంటీన్ ద్వారా నిర్వహిస్తుంటే జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ప్రభుత్వ అన్న క్యాంటీన్ ఏర్పాటు అయ్యేవరకు దాతల సహకారంతో నాలుగున్నర సంవత్సరాలగా నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ విఎస్ అప్పలరాజు, జీనుమణి బాబు, కొత్త కొండబాబు, రేఖ బుల్లి రాజు, వేములకొండ జోగారావు, యల్లమిల్లి సీఎం, బద్ది సురేష్,గని శెట్టిసన్యాసిరావు, మమ్మన దుర్గాప్రసాద్, చందక వెంకటరమణ ,బత్తుల గణేష్, మంచాల హేమాద్రి, ప్రసాద్, గేడ్డం అచ్చిరాజు,కందుల సత్యనారాయణ ,తాండ్రంగి అచ్చారావు, బొడ్డు ప్రసాద్, బత్తుల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.