
పయనించే సూర్యుడు డిసెంబర్ 30, కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ ఆదోని జిల్లా ఏర్పాటు సాధన కోసం ప్రభుత్వంతో చర్చల కోసం ఆదోని టిడిపి ఇన్ చార్జి మీనాక్షి నాయుడు , టిడిపి కర్నూలు జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ ఆద్వర్యంలో కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు ని రాష్ట్ర సచివాలయంలో ఆదోని జిల్లా సాధన జెఏసి నాయకులు కలిసి ఆదోని ప్రాంత ప్రజల ఆకాంక్ష అయిన ఆదోని జిల్లా ఏర్పాటు కోసం వినతి పత్రం సమర్పించి చర్చించారు.ఆదోని జిల్లా కోసం గత ఆరేళ్లుగా జరుగుతున్న పోరాటం, ఆదోని జిల్లా ఆవశ్యకత గురించిన ఫైలు మంత్రి కి అందజేయటం జరిగింది. ఆదోని జిల్లా ఏర్పాటు పై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని మంత్రి కి జేఏసి నాయకులు స్పష్టం చేశారు. కొత్త జిల్లాల నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత ఆదోని జిల్లా డిమాండ్ వచ్చినందున ప్రస్తుతం ఆదోని జిల్లా ఏర్పాటు విషయం పరిశీలించలేక పోయామని, ఆదోని జిల్లా ఏర్పాటు చేస్తే మిగతా కర్నూలు జిల్లాను ఎలా సర్దుబాటు చేయాలి అనే విషయం పై అధ్యయనం చేయాలని అన్నారు. కాని ఆదోని ప్రాంత ప్రజల సెంటిమెంటును గౌరవిస్తూ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఆదోని జిల్లా ఏర్పాటు తప్పక పరిశీలిస్తామని అన్నారు. మీనాక్షి నాయుడు జిల్లాల పునర్ విభజన మంత్రి అనగాని సత్య ప్రసాద్ తో ఆదోని జిల్లా ఏర్పాటు పై హామి ఇప్పించేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జేఏసి నాయకులు రఘురామయ్య, అశోకానంద రెడ్డి, నూర్ అహ్మద్, కోదండ, కృష్ణమూర్తి గౌడ్, రామలింగ, అమరేష్, గణేష్, శేఖర్, వీరేష్, దస్తగిరి, అమరేష్, రాజు, సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.