కె.ఎస్.ఎన్ డిగ్రీ కళాశాల పీడిని సస్పెండ్ చేయాలి : ఐక్య విద్యార్ధి సంఘాలు

★ కె.ఎస్.ఎన్ డిగ్రీ విద్యార్థినీలతో కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన ★ విద్యార్థినిలతో కలిసి నాయకులు కలెక్టర్ కి వినతి పత్రం ★ పీడీ మీద విచారణ చేసి సస్పెండ్ చేయాలని కోరిన విద్యార్థినిలు ★ విద్యార్థినిల ఇబ్బందులు మంత్రి నారాలోకేష్ కి కనపడవా వినపడవా అంటూ సూటి ప్రశ్న? ★ ఆర్జెడి దృష్టికి తీసుకెళ్లిన పీడీ మీద చర్యలు శూన్యం! ★ కలెక్టర్ న్యాయం చేయకపోతే పీడీ తిరుకి నిరసనగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని తెలిపిన ఐక్య విద్యార్థి నాయకులు

పయనించే సూర్యుడు డిసెంబర్ 30 అనంతపురం కె.ఎస్.ఎన్ కళాశాల పిడి విద్యార్థినిలను భయభ్రాంతులకు గురిచేస్తూ తన అనుకూలమైనటువంటి వారికి స్పోర్ట్స్లో అవకాశం కల్పిస్తానంటూ తన కాలు కింద పడి ఉండాలని ధోరణిగా విద్యార్థినిలతో దుర్భాష లాడుతున్నటువంటి తీరుకు నిరసనగా అనంతపురం కలెక్టర్ కార్యాలయం వద్ద ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థినిలతో కలసి నిరసన కార్యక్రమం తెలియజేసి అనంతపురం కలెక్టర్ ఆనంద్ దృష్టికి స్వయంగా విద్యార్థినిలతో సమస్యను తెలియజేసి విద్యార్థినీల పట్ల పిడి వ్యవహరించిన తీరుని ఐక్య విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో విద్యార్థినిలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి కె.ఎస్ ఎన్ డిగ్రీ కళాశాలలో విద్యార్థినిల పట్ల పిడి తీరు ఆసభ్యకరంగా ఉన్నదంటూ ప్రముఖ వార్తాపత్రికల్లో వ్యాసాలుగా వచ్చిన స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రులు, అధికారులు ఏమి మాట్లాడకుండా మౌనంగా ఎందుకు ఉన్నారంటూ మహిళా విద్యార్థినీల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి పీడీ మీద చర్యలు తీసుకోకుండా మహిళా విద్యార్థినిలని పరామర్శించకుండా ఉండడం ఏమిటని కూటమి ప్రజా ప్రతినిధులని అధికారులని ఉద్దెశించి విద్యార్థి నాయకులు ఉద్యమాలు చేస్తున్న నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్న కూటమి ప్రభుత్వాన్ని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నించారు పీడీ మీద విచారణ చేసి సస్పెండ్ చేసి కొత్త మహిళ పీడిని కళాశాలలో నియమించాలని సమస్య పునరావృతం కాకుండా పరిష్కరించే ధోరణిలో కూటమి ప్రభుత్వం విఫలమవుతున్నదని మంత్రి నారా లోకేష్ సకల శాఖల మీద పెట్టిన దృష్టి విద్యార్థుల కష్టాల మీద ద్రుష్టి లేకపోవడం దురదృష్టమని వారు మంత్రి నారా లోకేష్ ని విమర్శించారు కలెక్టర్ గారితో మాట్లాడుతూ విద్యార్థినిలకు న్యాయం చేయకపోతే ఐక్య విద్యార్థి సంఘాలుగా విద్యార్థులకు న్యాయం జరిగే వరకూ పోరాటాలు ఉంటాయని స్పష్టం చేశారు కార్యక్రమంలో ఐక్య విద్యార్ధి సంఘాల నాయకులు ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయిస్వామి, వైయస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ యాదవ్ ఎన్.ఎస్.యు.ఐ జిల్లా అధ్యక్షులు ఓబులేసు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సమైక్య రాష్ట్ర కార్యదర్శి సురేష్ యాదవ్ ఏఐఎస్బి జిల్లా నాయకులు విజయ్ ఎన్.ఎస్.యు.ఐ నాయకులు వినోద్ వైస్సార్సీపీ విద్యార్ధి విభాగం నగర అధ్యక్షులు కైలాష్ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ నాయకులు పులి కార్తికేయ, ఫయాజ్, బాబా ఇమ్రాన్, మెహరాజ్, శేఖర్, విజయ్, రఫీ, జుబేర్, నరేష్, సాయి, చందు, మల్లీ ఏఐఎస్ఎఫ్ నగర అధ్యక్షులు మంజునాథ్ జిల్లా ఉపాధ్యక్షులు వంశీ నాయకులు సాయి, ఉస్మాన్, రాజు, కుమార్, కార్తీక్, పాల్గొన్నారు