కొప్పర్తి క్యాంప్ సర్పంచ్ ప్రమాణస్వీకారం

★ ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించిన సర్పంచ్.

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 30 బోధన్ :సాలూర మండలం కొప్పర్తి క్యాంప్ గ్రామ సర్పంచ్ గా ఎన్నుకోబడిన సతీష్ సోమవారం అధికారుల సమక్షంలో ప్రమాణస్వీకారం చేసి గ్రామ సర్పంచ్ బాధ్యతలను స్వీకరించారు.సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్ వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.ప్రజల సంక్షేమం గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పాలకవర్గంతో కలిసి సమిష్టిగా కృషి చేస్తామని సర్పంచ్ గ్రామ ప్రజలకు భరోసా ఇచ్చారు.ప్రజల సహకారం ఉంటే గ్రామ అభివృద్ధి ఉత్తమంగా జరుగుతుందని పేర్కొన్నారు.గ్రామ అభివృద్ధికి ప్రజలు సహకరించవలసిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో అధికారులు,పంచాయతీ పాలకవర్గం,గ్రామ పెద్దలు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.