కొప్పోలు శ్రీ ఉమా సంగమేశ్వర స్వామి ఆలయ కమిటీ ఏర్పాటు

పయనించే సూర్యుడు డిసెంబర్ 30 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్న అశోక్ ) కొప్పోలు శ్రీ ఉమా సంగమేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీని బసవ కళ్యాణ్ పీఠాధిపతి శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి పర్యవేక్షణలో ఏర్పాటు చేశారు ఆలయ కమిటీ అధ్యక్షుడిగా కుంట పరమేశ్వర రెడ్డి ప్రధాన కార్యదర్శిగా రాయిని మధు సూదన్ కోశాధికారిగా కంటిగారి రాజశేఖర్రెడ్డిలను నియమించారు అనంతరం ఆలయ అభివృద్ధిపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఆలయ పరిసరాల సౌకర్యాల అభివృద్ధిలో భాగంగా ఆలయ ఆవరణలోని రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద ఉన్న సీసీ రోడ్డుకు మరమ్మతుల నిమిత్తం కొప్పోలు మురళీ గౌడ్ రూ.2 లక్షల విరాళాన్ని కమిటీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ బాధ్యులు బాపు సెట్ సీతారామరావు దేశ్పాండే మురళీధర్ గౌడ్ గాండ్ల సంగమేశ్వర్ కందుకూరు రవీందర్ కుమ్మరి శంకరయ్య మాజీ ఎంపీడీఓ రమేష్ ఏం ఆర్ ఓ చంద్రశేఖర్ సతీష్ గౌడ్ గాండ్ల సర్వేశ్వర్ కన్నయ్య గారి శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.