ఘనంగా అజర్ భాయ్ జన్మదిన వేడుకలు

★ నిరుపేదలకు ఆహార పంపిణీతో సామాజిక సేవకు నాంది

పయనించే సూర్యుడు, కోరుట్ల, డిసెంబర్ 30 కోరుట్ల పట్టణంలో యువ నాయకుడు, సేవాభావానికి చిరునామాగా నిలిచిన అజర్ బాయ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు కలిసి నిరుపేదలు, పేదలకు ఆహార పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మానవతా విలువలకు నిదర్శనంగా నిలిచారు.పట్టణంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన పేదలు, వృద్ధులకు, ప్యాకెట్లు అందజేశారు. జన్మదినం అంటే కేవలం ఆనందోత్సవం కాదు. ఇతరుల ఆకలి తీర్చడమే నిజమైన ఆనందం అనే భావనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. సమాజంలోని చివరి వ్యక్తి వరకూ సహాయం అందించాలనే సంకల్పంతో ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువకులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అజర్ బాయ్‌ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన చేపడుతున్న సేవా కార్యక్రమాలు యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాయని పలువురు ప్రశంసించారు.