పయనించే సూర్యుడు డిసెంబర్ 30, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండలం లో నూతనంగా ప్రభుత్వ నర్సింగ్ కళాశాల స్థాపనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.ఈ కళాశాల నిర్మాణానికి గాను రూ. 29.00 కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగింది. ఈ కళాశాలలో బీ.ఎస్‌సి (నర్సింగ్) కోర్సు ప్రారంభించి, ప్రతి సంవత్సరం 60 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.ఈ నిర్ణయంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్య అందుబాటులోకి రావడంతో పాటు, చింతకాని మండలం అభివృద్ధికి మరింత ఊతం లభించనుంది.ఈ చారిత్రక నిర్ణయానికి ప్రత్యేక చొరవ తీసుకుని, చింతకాని మండల ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు కి చింతకాని మండల ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసిన మత్కేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ & చింతకాని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వరరావు.