చింతకాని హై స్కూల్ ని సందర్శించిన సర్పంచ్ కిలారు మనోహర్ బాబు

పయనించే సూర్యుడు డిసెంబర్ 30, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ని సోమవారం నాడు చింతకాని సర్పంచ్ కిలారు మనోహర్ బాబు సందర్శించారు.హై స్కూల్ ప్రాంగణంలో గ్రామంలోని యువత ఆటలాడుకునేందుకు అనువైన సమయంలో యువతకు అవకాశం ఇచ్చేందుకు సోమవారం నాడు ప్రధానోపాధ్యాయులు శర్మతో కలిసి చర్చించారు.అనంతరం ఈ విషయంపై హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు సానుకూలంగా స్పందిస్తూ యువత ఆడుకునేందుకు అనుమతి ఇచ్చారు.ఈ విషయంపై గ్రామంలోని యువత సర్పంచ్ కిలారు మనోహర్ బాబుకి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం స్కూల్ ఆవరణలో పరిసరాలను పరిశీలించి తన వంతు సహకారంతో మునుముందు మంచి పనులను చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చి తరగతి గదులలో ఉన్న స్కూల్ పిల్లలతో కలిసి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్ బాబు,చిలువేరు నరసింహారావు దిశ రిపోర్టర్ సురేందర్, గ్రామ యువత కణతాల సతీష్,ఎన్నేబోయిన జైపాల్,రేగురి నరేష్,పొనుగోటి నరేష్,జలగనబోయిన నరేష్ ,తోట వెంకటేష్,అలీ పాషా మొదలైన వారు పాల్గొన్నారు.