చిన్నారులు ఆ దేవుని ప్రతిరూపాలు జస్విక్ కు అన్నప్రాసనలో ప్రముఖ లాయర్ రామకృష్ణారెడ్డి ..

పయనించే సూర్యుడు డిసెంబర్ 30, కాకినాడ జిల్లా ప్రతినిధి కాకినాడ రూరల్ (బి వి బి) చిన్నారులు ఆ దేవుని ప్రతిరూపాలని ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం మూడో ఏపీఎస్పీ ఎదురుగా గల ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి కార్యాలయం వద్ద స్వర్గీయ అల్లిబోయిన జక్కయ్య శ్రీమతి పాస్టర్ శ్యామల దంపతుల ముద్దుల మనవడు మహిమ రాజు సత్యప్రియ కుమారుడు జస్విక్ అన్నప్రాసన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లాయర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మంచి పాస్టర్ గా తాతయ్య జక్కయ్య పేరు నిలబెడతాడని అన్నారు. ముందుగా ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి శ్రీమతి శిరీష దంపతులు చిన్నారి జస్విక్ కు అన్న ప్రాసన చేశారు. అనంతరం కేకులు కట్ చేశారు.