చూపరులను ఎంతగానో ఆకర్షించుకున ఇండియా ఆన్ ఏ ప్లాట్

పయనించే సూర్యుడు డిసెంబర్ 30, కాకినాడ జిల్లా ప్రతినిధి కాకినాడ రూరల్ ( బి వి బి) పిల్లలకు చదువులతో పాటు ఆటపాటలు అన్ని రంగాలలోనూ ఎదగాలని స్కేలార్క్ గ్లోబల్ స్కూల్ డైరెక్టర్ లతాంగి, చైర్ పర్సన్ యు రాజేశ్వరి, డిరజ్ సెక్రెటరీ అండ్ కరస్పాండెంట్ లు ఆధ్వర్యంలో కాకినాడ జగన్నాధపురం వి యల్ కన్వర్షన్ హాల్ యందు చిన్నారి విద్యార్థులు తల్లిదండ్రుల మధ్య స్కైలార్ గ్లోబల్ స్కూల్ ఆధ్వర్యంలో ఇండియా ఆన్ ఏ ప్లాట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల యొక్క డిఫరెంట్ ఫుడ్స్ తో తల్లిదండ్రులు విద్యార్థులు ఒక ఫుడ్ మాల్ ను నిర్వహించారు. తయారుచేసిన ఫుడ్ ను ఎక్కువ సేల్స్ అయినా వారికి, రుచికరంగా చేసిన వారికి బహుమతులను అలాగే పార్టిసిపేట్ చేసినవారికి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుకుని కలెక్టర్, డాక్టర్ ,ఇంజనీర్ కాక ప్రధానమంత్రి మోడీ నిర్ణయాల ప్రకారం భారతదేశం అన్ని రంగాలను ముందుండాలని ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమము నిర్వహించమని ప్రతి ఒక్కరూ మా స్కూల్ నుంచి కూడా బిజినెస్ మ్యాన్ లుగా ఉండాలని ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని దీనికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు అని గ్లోబుల్ స్కేలార్క్ స్కూల్స్ ద్రాక్షారామ, సామర్లకోట కాకినాడ లో రెండు బ్రాంచ్ లు ఉన్నాయని వారి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని తమ ఆనందాన్ని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *