చైల్డ్ ఆర్టిస్టులను సన్మానించిన మిత్ర ఫౌండేషన్ సభ్యులు

పయనించే సూర్యుడు, డిసెంబర్ 30 2025, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో రిక్కీ తేజ్, పెయింట్ ఆర్టిస్ట్ శాన్వి కృతి లు స్వయం కృషితో ఎలాంటి శిక్షణ లేకుండా అద్భుతమైన చిత్రాలు వేస్తున్న చార్కోల్ ఆర్టిస్ట్ చిన్నారులను మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. చిన్నారులకు మిత్ర- రైజింగ్ ఆర్టిస్ట్ అవార్డు లను అందజేశారు. సోమవారం చిన్నారులను ఉద్దేశించి మాట్లాడుతూ అత్యంత లోతైన భావాలను ప్రతిబింబించేలా, జీవంతో కనిపించే ముఖచిత్రాలు, భావోద్వేగాలు పలికించే స్కెచెస్ గీయడంలో ఈ చిన్నారి చూపిన నైపుణ్యం అందరినీ ఆకట్టుకుంది. వయసుకు మించిన పరిపక్వత, భావాన్ని అర్థం చేసుకునే శక్తి, షాడో మరియు డీటెయిలింగ్‌లో నైపుణ్యం అతని ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి. ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రతి పిల్లాడిలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి సరైన సమయంలో ప్రోత్సాహం అందిస్తే రేపటి తరానికి గొప్ప కళాకారులుగా సమాజానికి ఉపయోగపడతారు అన్నారు. ఈ అవార్డు ఆ దిశగా మా చిన్న ప్రయత్నం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిత్ర ఫౌండేషన్ ఫౌండర్ చంద్రకాంత్ రెడ్డి, అధ్యక్షుడు శ్రీకాంత్ నేత, చిన్నారుల తల్లిదండ్రులు, మిత్ర ఫౌండేషన్ సభ్యులు రసూల్, రావుఫ్, కార్తిక్, తరుణ్, అరవింద్, మహేష్, రాములు, జిలానీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *