పయనించే సూర్యుడు డిసెంబర్ 30 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే. శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండలం కారుకొండ గ్రామం విద్యార్థుల ప్రతిభ జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన మరియు జిల్లాస్థాయి ఇన్స్పైర్ ప్రదర్శన నాగర్ కర్నూల్ జిల్లాలో ని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో గౌరవ కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.ఈ ప్రదర్శనలో బిజినపల్లి మండలం లోని ప్రాథమికోన్నత పాఠశాల కారుకొండ విద్యార్థులు మరియు గైడ్ టీచర్లు కలిసి తయారుచేసిన ఇన్స్పైర్ విభాగంలో వ్యవసాయ రంగంలో రోబోలు అనే అంశం మరియు సైన్స్ ఫేర్ లో సుస్థిర వ్యవసాయ అభివృద్ధి మరియు సేంద్రియ వ్యవసాయం అంశాలకు సంబంధించిన మొత్తం 3 ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది. ఈ ప్రాజెక్టులను కలెక్టర్ గారు చూసి అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఈవో , బిజినపల్లి ఎంఈఓ , ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ, ఉపాధ్యాయులు భాగ్యలక్మి, శ్రీకాంత్,చైతన్య విద్యార్థులు నిహారిక, వైష్ణవి, మధు, అభిలాష్ పాల్గొన్నారు.