
పయనించే సూర్యుడు డిసెంబర్ 30, ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ. కర్నూల్ వైబి నారాయణ పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాహి నారాయణ ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు అత్యంత ఆడంబరంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానిక ముఖ్య అతిథిగా ఏజీఎం రమేష్ కుమార్ అలాగే క్లస్టర్ ప్రిన్సిపాల్స్ మరియు అతిథులుగా హై స్కూల్ జోనల్ కోఆర్డినేటర్ శ్రీహరి రెడ్డి ఈ చాంప్స్ జోనల్ కోఆర్డినేటర్స్ ప్రియాంక & షాహీదా ఈ కిడ్స్ జెడ్ సి జైబా స్పోర్ట్స్ ఆర్ & డి హెడ్ పవన్ , వివిధ శాఖల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు ఏజీఎం రమేష్ కూమార్ ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలను చేసి క్రీడలను ప్రారంభించారు. అనతరం క్రీడాకారుల నుంచి వందనం స్వీకరించారు.చదువులంటే కేవలం పుస్తకాలతో కుస్తీ పట్టడం కాదు బాలల సంపూర్ణ ఎదుగుదలకు బాటలు పరిచే ఆటలు ఆడటం ద్వారా బృంద స్ఫూర్తి, సహనం, చురుకుదనం, ఏకాగ్రత, పోరాట పటిమ, క్రమశిక్షణ, కొత్తగా ఆలోచించడం వంటి లక్షణాలను పెంపొందిస్తాయి. మన ప్రాచీన విద్యా విధానంలో వ్యాయామ, యుద్ధ విద్యలకు ప్రముఖ స్థానం ఉండేదని విలువిద్య, వేట, కత్తి సాము, గుర్రపు స్వారి, వంటివి బాల్యం నుంచే పాఠాల్లో భాగమయ్యేవి యోగ నేర్చుకోవడం విద్యార్థుల ప్రణాళికలో ఉండేది ఫలితంగా పిల్లల్లో శరీరక దారుఢ్యంతో పాటు మానసిక దృఢత్వం అలవాడుతుందని ఆదోని నారాయణ విద్యార్థులు ఓవరల్ ఛాంపియన్ గ గెలుపొందడం హర్షించదగ్గ విషయం అని అన్నారు. ఈ సభను ఉద్దెశించి ఆదోని నారాయణ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ ఆదోని విద్యార్థులు చదువు లోనే కాదు ఆట పాటలలోనూ ఓవర్ అల్ ఛాంపియన్స్ రావడం గర్వకారణం ఓటమి నుంచి నేర్చుకున్న పాఠం, విజయం కంటే విలువైనది మీరు ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తారనేది ముఖ్యం కాదు, ప్రాక్టీస్ సమయంలో మీ మనస్సు ఎంత నిమగ్నమై ఉందనేది ముఖ్యం సంగ్రహంగా చెప్పాలంటే, పాఠ్యపుస్తకాల జ్ఞానంతో పాటు, విద్యార్థులు క్రీడలను కూడా వారి విద్యలో భాగంగా చేసుకోవాలి. ఇది దీర్ఘకాలంలో, ఇది ఖచ్చితంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంకా, క్రీడలు భవిష్యత్తులో చాలా ఉద్యోగ అవకాశాలను అందిస్తాయి. ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, ఇది ఒక వ్యక్తిని క్రమశిక్షణ గలవాడిగా కూడా చేస్తుందని తెలిపారు గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను బహుకరించారు ఉపాధ్యాయలు విద్యార్ధులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గోని కార్యక్రమని విజయవంతం చేశారు.

