జీవో 252ను సవరించాలి జర్నలిస్టుల హక్కులకై పోరాటం తప్పదు

★ నాగర్‌కర్నూల్ జిల్లా TWJF మహాసభల్లో పిల్లి రామచందర్ డిమాండ్ ​ ★ జిల్లా అధ్యక్షుడిగా పరిపూర్ణం, కార్యదర్శిగా వెంకటస్వామి ఎన్నిక

పయనించే సూర్యుడు డిసెంబర్ 30 నాగర్ కర్నూలు జిల్లా రిపోర్టర్ కే. శ్రావణ్ కుమార్ నాగర్‌కర్నూల్ జిల్లా సోమశిల జర్నలిస్టుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న జీవో నెంబర్ 252ను ప్రభుత్వం వెంటనే సవరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) రాష్ట్ర అడక్ కమిటీ కన్వీనర్ పిల్లి రామచందర్ డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామంలో నిర్వహించిన TWJF జిల్లా మూడవ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ​చిన్న పత్రికలకు అన్యాయం: ఈ సందర్భంగా రామచందర్ మాట్లాడుతూ.. 35 ఏళ్ల క్రితం నాటి జర్నలిజానికి, నేటి జర్నలిజానికి భారీ మార్పులు వచ్చాయని, మారుతున్న కాలానికి అనుగుణంగా జర్నలిస్టులు ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 252 వల్ల జర్నలిస్టులకు తీవ్ర నష్టం జరుగుతోందని, ముఖ్యంగా 2.5 లక్షల సర్క్యులేషన్ ఉండాలనే నిబంధన చిన్న పత్రికల మనుగడను దెబ్బతీస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత అక్రిడేషన్ నిబంధనలను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, వీటిపై జిల్లా కలెక్టరేట్ల వద్ద పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ​విలువల రక్షణే ధ్యేయం: జర్నలిస్టులు వృత్తిపరమైన విలువలను కాపాడాలని, ఎటువంటి బెదిరింపులకు లొంగకుండా నిర్భయంగా పనిచేయాలని కోరారు. మహిళా జర్నలిస్టులకు వృత్తిలో తగిన గౌరవం, రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. జీవో 242 వంటి కఠిన నిబంధనలను తొలగించే వరకు జర్నలిస్టుల పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ​నూతన కార్యవర్గ ఎన్నిక: ఈ మహాసభల సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ​జిల్లా అధ్యక్షుడు: ఏ. పరిపూర్ణం ​జిల్లా కార్యదర్శి: వెంకటస్వామి ​కోశాధికారి: బాదం పరమేష్ ​ఉపాధ్యక్షులు: చారకొండ వెంకటేష్, రజిని బాబు, మేకల శివ. ​రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా తాటికొండ కృష్ణ, చక్కర రామచందర్, జాతీయ కౌన్సిల్ మెంబర్‌గా సిపి మల్లికార్జున్ ఎన్నికయ్యారు. జిల్లా కమిటీ సభ్యులుగా పరమేష్, గంధం బంగారయ్య, మల్లేష్, సురేందర్, తరుణ్, లక్ష్మోజిలను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన సభ్యులు జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.