తల్లాడలో ఘనంగా స్వాముల ఇరుముడి కార్యక్రమం

★ తల్లాడ సర్పంచ్ పెరిక. నాగేశ్వరావు స్వామి ఇరుముడి కి హాజరైన మాజీ ఏఎంసి వైస్ చైర్మన్ ధూపాటి భద్రరాజు ★ శబరిమల అయ్యప్పస్వామి సన్నిదానం కి బయలు దేరిన స్వాములు

పయనించే సూర్యుడు న్యూస్ : డిసెంబర్ 30, తల్లాడ రిపోర్టర్ తల్లాడ లో శ్రీకృష్ణుడి గుడి దగ్గర అర్చకులు తనుగుల. మణికంఠ శర్మ చే ఇరుముడి కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది.తల్లాడ మేజర్ గ్రామ పంచాయితీ సర్పంచ్ పెరిక.నాగేశ్వర రావు ఇరుముడి కార్యక్రమం కి టీడీపి సీనియర్ నాయకులు మాజీ వైరా వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ ధూపాటి భద్ర రాజు హాజరై స్వాములకి పూల మాల వేసి ఇరుముడి కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో స్వాములు గాదె. నరసింహా రావు, గుడిపల్లి. పుల్లయ్య, సితా రామిరెడ్డి, అనుమోలు.శ్రీనివాసరావు, అశోక్, రవి తదితరులు పాల్గొన్నారు.