తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా గువ్వల రమేష్ రెడ్డి ఎన్నిక పట్ల గాండ్ల పల్లె లోసంబరాలు

★ పెద్ద ఎత్తున ఉచిత అన్నదాన కార్యక్రమం

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ డిసెంబర్ 30.12.2025 చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 చౌడేపల్లె మండల ప్రతినిధి జె. నాగరాజ) తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడిగా గువ్వల రమేష్ రెడ్డి ( చిట్టి) ఎన్నిక పట్ల ఆ పార్టీ శ్రేణులు గాండ్ల పల్లెలో సంబరాలు చేసుకున్నాయి ఇటీవల రాష్ట్ర అధిష్టానం చౌడేపల్లి మండలం అధ్యక్ష పదవికి ఇద్దరు వ్యక్తులను ప్రకటిస్తూ ఐ.వి.ఆర్.ఎస్ ద్వారా ఓటర్లను ఆహ్వానించింది వారిలో గువ్వల రమేష్ రెడ్డి కి అత్యధికంగా ఓట్లు లభించాయి ఈ విషయం సామాజిక మాధ్యమాలలో హల్చల్ చేయడంతో గువ్వల రమేష్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు అయ్యాడని తెలుగుదేశం పార్టీలో సంబరాలు ఆకాశాన్నంటాయి పార్టీ శ్రేణులు గాండ్ల పల్లె లో భారీ కేక్ కటింగ్ చేసి అభిమానులకు పంచిపెట్టారు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం జరిగింది బాణాసంచా పేల్చి డ్రమ్స్ వాయిద్యాలతోతమ అభిమానాన్ని చాటుకున్నాయి ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆవుల రామచంద్రయ్య పూల చంద్రమౌళి బాబునాయుడు అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు