నట్టల నివారణ మందులు పంపిణీ

పయనించే సూర్యుడు 30-12-2025 ఎన్ రజినీకాంత్:- హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్త పెల్లి గ్రామంలో పశు వైద్య శాఖ అధికారి ఆధ్వర్యంలో సోమవారం గొర్రెలు, మేకలకు ఉచితంగా నట్టల మందులు పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి సర్పంచ్ శిఖ ప్రదీప్, ముల్కనూర్ సహకార సంఘం ఉపాధ్యక్షులు గజ్జి వీరయ్య, ఆదరీశ్రీనివాస్ -పశువులకు నట్టల మందులు వేయించి వ్యాధులు సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది రవీందర్, సుధీర్ పాల్గొనడం జరిగినది..