నూతన సంవత్సరం డైరీ క్యాలెండర్ ఆవిష్కరించిన

★ ఎంఈఓ నరసింహారాజు

పయనించే సూర్యుడు డిసెంబర్ 30 శింగనమల మండల ఎం ఆర్ సి నందు యుటిఎఫ్ 2026 సంవత్సరము డైరీ మరియు క్యాలెండర్ ను ఎంఈఓ 1 నరసింహారాజు సోమవారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ ఉద్యమాలకు దిక్సూచిగా యుటిఎఫ్ పనిచేస్తున్నదని రాబోయే సంవత్సరంలో ఉపాధ్యాయులు ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్లడానికి యుటిఎఫ్ సక్రమమైన సమాచారం ఇవ్వాలని కోరారు ఈ సందర్భంగా యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల హక్కులను కాపాడటంలో యుటిఎఫ్ ముందువరసలో ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ గోవిందరాజులు ఎంఆర్సి సిబ్బంది వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు