పయనిచే సూర్యుడు 30-12-25,నాగరాజు రుద్రరపు టౌన్ రిపోటర్, కె. నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా:- నూతన సంవత్సర వేడుకలపై ప్రభుత్వం విధించిన ఆంక్షలను అతిక్రమిస్తే చర్యలు తప్పవు ప్రతీ వాహనాదారుడు ట్రాఫిక్ నియమాలు పాటించాలి అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో సాయంత్రం 6 గంటల నుంచి వాహనాల తనిఖీ, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించొద్దు. ఫామ్ హౌస్, క్లబ్‌లు, గేటెడ్ కమ్యూనిటీల్లో అనుమతి లేకుండా వేడుకలు నిర్వహించొద్దు. ప్రజలను భయాందోళనకు గురి చేసేలా క్రాకర్స్, అత్యధిక మొతాదులో గల సౌండ్ సిస్టమ్ (డీజే) ఏర్పాటు చేయొద్దు. వాహననడుపుతూ మైనర్లు పట్టుబడితే మైనరుపై, వాహన యాజమానిపై కేసులు నమోదు చేస్తాం. త్రిబుల్ రైడింగ్ చేయొద్దు, పెద్ద శబ్దాలు చేసే సైలెన్సర్లతో వాహనాలు నడిపితే.. ఆ వాహనాలను సీజ్ చేస్తాం. గుంపులు గుంపులుగా రోడ్లపై కేకలు వేస్తూ తిరగడం, వాహనాలతో ర్యాలీగా వెళ్లడం చేయొద్దు. రోడ్ల పై కేక్ కటింగ్ లాంటివి చేయొద్దు. ఇంట్లో ఉండి కుటుంబ సభ్యులతో సంతోషంగా వేడుకలు నిర్వహించుకోవడం మంచిది. ప్రమాదాలకు దూరంగా ఉండాలి.