పయనించే సూర్యుడు డిసెంబర్ 30 ( ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండలం నల్లగొండ జిల్లా) డిండి మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల కళాశాలలో మండల వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో విద్యార్థులకు నేల కాలుష్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా నేల సమూహాలను ఎలా సేకరించాలో వివరించారు. పంట వైవిద్దీకరణ, నేల కాలుష్యం, నీటి కాలుష్యం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం మొక్కల సమగ్ర పోషక నిర్వహణ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.