
పయనించే సూర్యుడు న్యూస్ 30 (శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి గ్రామంలో శాసనసభ్యులు జె.సి. అష్మిత్ రెడ్డి ఆధ్వర్యంలో మన ఊరు పరిశుభ్రత, మన బాధ్యత కార్యక్రమం నిర్వహించడం జరిగింది పట్టణంలోని పలు వీధులలో విపరీతంగా పెరిగిపోయిన చెత్తను, మురికి కాలువలను, కంపచెట్లను10 జేసిబిలు,12 ట్రాక్టర్లు, డోజర్ సహాయంతో మరియు పారిశుద్ధ కార్మికుల సహాయంతో గ్రామంలో చాలా కాలనీ లలో ప్రధాన రహదారుల ఇరువైపులా పెరిగిన కంప చెట్లను, కాలనీలలో అక్కడక్కడ పెరిగిన పిచ్చి మొక్కలను, మురికి కాలువలను శుభ్రం చేయడం జరిగింది. అలాగే యాడికి గ్రామంలో ప్రధానంగా ఉన్న పెద్ద, పెద్ద కాలువలను జె.సి.ఆస్మిత్ రెడ్డి పరిశీలించి కాలువలను క్లీన్ చేయడానికి తగిన వాహనాలను వారం రోజుల పాటు తాడిపత్రి నుండి పంపించి ఇక్కడ క్లీన్ చేయించడం జరుగుతుందని చెప్పారు అలాగే ఆంజనేయస్వామి కాలనీలో సీ.సీ.రోడ్డుకు భూమిపూజ నిర్వహించారు. వేములపాడు రోడ్డులో ఉన్న సంపు నందు అత్యాధునిక మోటర్లను ప్రారంభించినారు ఒక రోజుకు 20లక్షల లీటర్ల నీటిని పంపిణీ చేస్తుంది అని తెలిపారు యాడికిలో తాగునీటికి కొరత లేకుండా ప్రతి ఇంటికి నీటి సౌకర్యాన్ని కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.