పిఆర్సిని వెంటనే అమలు చేయాలి – జాప్యం జరిగితే ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తాం

★ అన్ని రకాల పెండింగ్ బిల్లులను తక్షణమే మంజూరు చేయాలి ★ ఎన్జీఓల జోక్యం నిరోధించాలి- శిక్షణల పేరిట బోధన సమయాన్ని హరించటం సరైంది కాదు ★ టి ఎస్ యు టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి. టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ .వెంకట్.

పయనించే సూర్యుడు, డిసెంబర్ 30, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టి ఎస్ యు టి ఎఫ్ కమిటీ విస్తృత సమావేశాల్లో భాగంగా రెండవ రోజు నిర్వహిస్తున్న ప్రతినిధుల సభ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో చావ రవి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఉద్యోగులకు పిఆర్సి(పే రివిజన్ కమిటీ) ని జులై 1, 2023 నుండి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో పిఆర్సి సాధన కొరకు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యోగుల పెండింగ్లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలని, పెండింగ్ లో ఉన్న డి ఎ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకట్ మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖలో కొనసాగుతున్న ట్రైనింగ్ లు (ఉన్నతి, ఎఫ్.ఎల్.ఎస్., లక్ష్య, ఎఫ్.ఆర్.ఎస్.) ఇతర కార్యక్రమాల పేరుతో విద్యాబోధనలకు ఆటంకంగా ఉన్న విధానాలపై సమీక్షించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు శిక్షణల పేరిట పాఠశాలలో ఎన్జీవోల జోక్యం సరైంది కాదని అన్నారు .కేజీబీవీ, మోడల్ స్కూల్ మరియు గురుకులాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం రెండు రోజులపాటు రాష్ట్ర విస్తృత కమిటీ సమావేశాలను జనగామ పట్టణంలో ఘనంగా నిర్వహించిన టీఎస్ యుటిఎఫ్ జనగామ జిల్లా కమిటీకి రాష్ట్ర కమిటీ పక్షాన అభినందనలు తెలియజేశారు. నేటి ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పరిధిలో, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పరిష్కరించాల్సిన విద్యారంగా, ఉపాధ్యాయుల సమస్యలపై 25 తీర్మానాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.జంగయ్య, చావ దుర్గా భవాని ,కోశాధికారి టి లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కె. సోమశేఖర్, ఎం రాజశేఖర్ రెడ్డి, డి. సత్యానంద్, జి. నాగమణి, కె. రంజిత్ కుమార్, ఎస్. మల్లారెడ్డి, జి. శ్రీధర్, ఆడిట్ కమిటీ కన్వీనర్ జె. యాకయ్య, జనగామ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి.చంద్ర శేఖర్ రావు, మడూరు వెంకటేష్, జిల్లా నాయకులు ఆకుల శ్రీనివాసరావు, కృష్ణ, మంగు జయప్రకాష్, హేమలత, శ్రీనివాస్, కృష్ణమూర్తి, కందుల శ్రీనివాస్, యాదవ రెడ్డి, కనకయ్య, సుధీర్ రెడ్డి, చైతన్య, వివిధ జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తీర్మానాలు కేంద్ర ప్రభుత్వం పరిధిలోనివి: జాతీయ విద్యావిధానం - 2020ని రద్దు చేయాలి. రాష్ట్రంలో యన్ఎస్ఈపి-2020 అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాలి. అందరికి ఆమోదయోగ్యమైన శాస్త్రీయ విద్యావిధానాన్ని అమలు చేయాలని టియస్ యుటిఎఫ్ డిమాండ్ చేస్తున్నది. నోడిటెన్షన్ విధానాన్ని కొనసాగించాలి: కేంద్ర ప్రభుత్వం నోడిటెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ, విద్యాహక్కు చట్టం-2009కి సవరణలు చేయడాన్ని టియుటిఎఫ్ తీవ్రంగా ఖండిస్తున్నది. పేదలకు విద్య దూరమైతుంది. కనుక నోడిటెన్షన్ విధానాన్ని కొనసాగించాలని టియస్ యుటిఎఫ్ డిమాండ్ చేస్తున్నది. 3.విద్యలో మతతత్వ విధానాలను విడనాడాలి. శాస్త్రీయ బోధనా విధానానికి ప్రాధాన్యతను ఇవ్వాలి. 5.విదేశి యూనివర్శిటీలను దేశంలో నియంత్రించాలి. 6.సిలబస్ మార్పుల పేరుతో శాస్త్రీయ అంశాలను, లౌకిక, సామ్యవాద బావాలకు అనుగుణమైన పాఠ్యాంశాల తొలిగింపు నిలిపివేయాలి. 7.దేశ వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు శాపంగా (కార్పొరేట్ శక్తులకు వరంగా మారిన సి.పి.ఎస్, యుపిస్ విధానాలను రద్దు చేసి ఒ.పి.ఎస్ ను పునరుద్దరించాలి. 8.మధ్యతరగతి ఉద్యోగులపై పెనుభారంగా ఉన్న ఆదాయపన్ను స్లాబ్లను సవరించాలి. స్టాండర్డ్ డిడక్షన్ 8 లక్షలకు, సేవింగ్స్ 5 లక్షలకు పెంచాలి. కొత్త పన్ను విధానంలో కూడా (ఇంటి అద్దె, గృహరుణాల వడ్డీలు, కంపల్సరీ) మినహాయింపులను తగ్గించి పన్ను చెల్లించేలా సవరణల చేయాలి. 9.ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పియస్. యుపియస్ ఉపాధ్యాయులకు ఓటు హక్కులు కల్పించాలి. ఆ మేరకు ప్రజాప్రాతినిధ్య చట్టం-1950ని సవరించాలి. రాష్ట్ర ఫ్రభుత్వం పరిధిలోనివి: -విద్యారంగం 1.విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలి: 2026 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో విద్యారంగానికి కనీసం 20% కేటాయించాలి. ఎన్జీవో ల జోక్యం నిరోధించాలి. ఉపాధ్యాయులకు బోధనలో స్వేచ్ఛనివ్వాలి. 3.పాఠశాలల్లో వసతుల కల్పనకోసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టి మధ్యలో నిలిచిన “మన ఊరు-మన బడి” కింద పూర్తి చేసిన పనులకు బిల్లులు చెల్లించాలి. మిగిలిన పనులను "అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ" ద్వారా పూర్తి చేయాలి. 4.ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల ప్రాథమిక పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్నభోజన పథకం నాణ్యతను పెంచుటకై మెనూను సవరించాలని, యూనిట్ ధర ప్రాథమిక పాఠశాలకు రూ.15/- యుపియస్ 18/-,హైస్కూల్ 20/- లకు పెంచాలని, కార్మికుల వేతనాలను కనీసం రూ.5000/- పెంచాలి. 5.ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు యూనిఫాంతోపాటు టై, బెల్ట్ రెండు జతల ఘాస్ అందించాలి. 6.ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి 1:20గా మార్చి, 50 మంది విద్యార్థులున్న పాఠశాలలకు తరగతికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున మరియు ఒక ప్రాధానోపాద్యాయుడి పోస్టును మంజూరు చేయాలి. 7.ఎసి, ఎస్ టి, బిసి విద్యార్ధులందరికి వారి అడ్మిషన్ నెం. మరియు పెన్ నెం. ఆధారంగా ధరఖాస్తుతో సంబందం లేకుండా ఉపకారవేతనాలు మంజూరు చేయాలి. 8.పాఠశాలల పర్యవేక్షణా వ్యవస్థ పటిష్టం చేయాలి. నూతన మండలాలకు ఎం.ఇ.ఓ పోస్టులు మరియు నూతన జిల్లాలకు డియిఓ పోస్టులు, రెవెన్యూ డివిజన్కు డిప్యూటి ఈఓ పోస్టులను మంజూరు చేయాలి. 9.పాఠశాల బోధనలో ఏకీకృత విధానం పేరుతో వివిధ పథకాలను ఉపాధ్యాయులపై రుద్దుట, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా బోధించే స్వేచ్ఛ విధానాన్ని అమలు చేయాలి. 10.ఎస్ఆర్ఎస్ యాప్ మరింత ఆధునికరించి అందరికి అనుకూలంగా మార్చాలి. ఉపాధ్యాయులకు బోధనేతర పనులను తగ్గించి బోధనపై దృష్టి పెట్టేలా చర్యలు తీసుకోవాలి. ఉపాధ్యాయ సమస్యలపై తక్షణమే పి.ఆర్.సి రిపోర్టు తెప్పించుకొని 01.07.2023 నుండి అమలు చేయాలి. 2.పెండింగ్లో ఉన్న 5 విడతలు డి.ఎ ను వెంటనే విడుదల చేయాలి. 3.ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా సి.పి.ఎస్ ను రద్దు చేసి ఓ.పి.ఎస్ పునరుద్ధరించాలి. డియస్సీ 2003 ఉపాధ్యాయులతోసహ 2004 సెప్టెంబర్ 1కి పూర్వమే నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత ఉద్యోగ నియామకం జరిగిన ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మెమో 57 ప్రకారం పాత పెన్షన్ వర్తింప చేయాలి.4. 317 జి.ఒ బాధితులకు సత్వర న్యాయం చేయాలి. శాశ్వత పరిష్కారం చూపాలి. 5.అన్ని అప్డ్ & పాఠశాలలకు అవసరమైన పోస్టులు మంజూరు చేసి బైఫర్కేట్ చేయాలి. 6.గత ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిన విధంగా 5571 ప్రియసాచ్యం పోస్టులను మంజూరు చేయాలి. 7.డిఇడ్ అర్హతతో పాటు బిఇడి అర్హత కలిగిన యసిటిలకు పియసాచ్యం ప్రమోషన్ అర్హత కల్పించాలి. 8.అప్గ్రేడేషన్ పక్రియ పూర్తయినందున, జివోలు 2,3,9,10లను రద్దు చేసి, యస్ఎ భాషలు, పిడి ఖాళీ పోస్టులలో జి.ఓ. 11,12ల ప్రకారం ప్రమోషన్లు ఇవ్వాలి. 9.398 రూపాయల వేతనంతో పనిచేసిన స్పెషల్ టీచర్ల సర్వీసు కాలానికి నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలి. 10.ఔట్ సోర్సింగ్, పార్ట్ం, గెస్ట్, అవర్ల బెస్ట్ విధానాలను రద్దు చేసి, అందరిని కాంట్రాక్టు ఉద్యోగులుగా పరిగణించాలి. వారందరికి సమానపనికి సమాన వేతనం చెల్లించాలి. 11.తాత్కాలిక ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ నియామకాల్లో వెయిటేజి ఇవ్వాలి. 11.కెజిబివి, యుఆర్ఎస్, గిరిజన, ఆశ్రమ పాఠశాలల్లో, గురుకులాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు టీచర్లందరికి అయా పోస్టుల యొక్క మినిమం బేసిక్పే ను అమలు చేయాలి. వారికి సర్వీస్కు ఇంక్రిమెంట్ విధానం అమలు చేయాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. 12.గురుకుల ఉపాధ్యాయులకు పనిభారాన్ని బట్టి అదనపు ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలి లేదా పనిభారాన్ని తగ్గించాలి. నైట్ డ్యూటీల నుండి మినహాయింపు ఇవ్వాలి. 13.గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, కెజిబివిల్లో ప్రత్యేక వార్డెన్లు, కేర్ టేకర్లను నియమించాలి. 14.ఎయిడెడ్ పాఠశాలలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. 15.మెడికల్ రీయింబర్స్మెంట్ పరిమితిని రు. 2 లక్షల నుండి 10 లక్షలకు పెంచాలి. రీయింబర్స్మెంట్ బిల్లులు మంజూరులో అసాధారణ జాప్యాన్ని నివారించాలి. 16.ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని సంస్కరించాలి. ఉద్యోగులందరికీ నగదు రహిత వైద్యం అందించాలి. 17.ఉపాధ్యాయులు, ఉద్యోగులందరికి మెరుగైన వైద్య సౌకర్యం కల్పించుటకై జిల్లా మెడికల్ కాలేజీలన్నిటిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా అప్గ్రేడ్ చేయాలి. వెల్నెస్ సెంటర్లను బలోపేతం చేయాలి. 18.గురుకుల, మోడల్ స్కూల్, ఎయిడెడ్, కెజిబివి, యుఆరాస్ ఉద్యోగులకు కూడా హెల్త్ కార్డులు జారీ చేయాలి. 19.గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో పండిట్, పిఈటి పోస్టులను అప్గ్రేడ్ చేయాలి. 20.అప్గ్రేడెడ్ ఆశ్రమ పాఠశాలలన్నిటికి ప్యాట్రన్ ప్రకారం అవసరమైన పోస్టులు మంజూరు చేయాలి. 21.ఆశ్రమ పాఠశాలలు మరియు ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో అకడమిక్ పర్యవేక్షణకు విద్యా సంబందిత అధికారులను నియమించాలి. 22.గురుకుల పాఠశాలల్లో మెనూ, అకడమిక్, పరిపాలనా విషయాల్లో ఏకీకృత విధానం కోసం కామన్ డైరెక్టరేట్ను ఏర్పాటు చేయాలి. 23.మధ్యాహ్న భోజన పథకానికి ప్రతినెల సకాలంలో బిల్లులు చెల్లించుటకు అవసరమైన గ్రీన్ ఛానల్ పేమెంట్ సిస్టంను మరింత పకడ్బందిగా అమలు చేయాలి. 24.గురుకుల పాఠశాలల బోధనా వేళలను 9.00 నుండి 4.30గా మార్చి వేయాలి. 25.మోడల్ స్కూల్స్, గురుకులాలకు 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలి. గురుకులాల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులకు గెజిటెడ్ హెూదా కల్పించాలి. ఉద్యమ అభినందనలతో పి. చంద్రశేఖర రావు & మాడూరి వెంకటేష్ (టీఎస్ యుటిఎఫ్ జనగామ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు)