పీజేఆర్ నగర్లో పాదయాత్రచేసిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

పయనించే సూర్యుడు, డిసెంబర్ 30 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార్) 124 అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పిజిఆర్ నగర్లో డ్రైనేజ్ లైన్ డామేజ్ అయి సమస్యగా ఉందని కాలనీవాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ కాలనీ లో పర్యటించి సమస్యను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ… డ్రైనేజ్ లైన్ మధ్య మధ్య లో పైపులు పగిలి సమస్య ఏర్ప డిందని వెంటనే కొత్త పైపులుఅమర్చి సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు అ దేవి ధంగా కాలనీలో నివాసాలు పెరిగిన డ్రైనేజీ లైన్ చిన్నగా ఉండడంతో నిత్యం నిండిపోతుంది కాబట్టి పెద్ద డ్రైనేజీ లైన్ ను నిర్మించి సమస్యను పరిష్కరిస్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. డ్రైనే జ్ లైన్ కొరకు వెంటనే ఎస్టిమేషన్ వేసి ఇవ్వాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సిహెచ్.భాస్కర్,ప్రదీప్ రెడ్డి,నస్రీన్,సతీష్,కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.