పెద్ద రెడ్డి పేటలో మండల స్థాయి కబడ్డీ పోటీలు

★ పుల్కల్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు తలారి అంజయ్య ఆధ్వర్యం లో

పయనించే సూర్యుడు న్యూస్ 30 డిసెంబర్ పుల్కల్ మండల ప్రతినిధి పెద్దగొల్ల విజయ కుమార్ సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని పెద్దరెడ్డి పేటలో అదివారం నిర్వహించిన పుల్కల్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సీనియర్ నాయకులు తలారి అంజయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ 17 కబడ్డీ పుల్కల్ మండల స్థాయి కబడ్డీ పోటీలను పుల్కల్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లన్న గారి దుర్గారెడ్డి ప్రారంభించారు ఈ కబడ్డీ పోటీలకు పుల్కల్ మండలంలోని ఆయా గ్రామాల నుండి కబడి ఆడడానికి ముందుకు వచ్చారు. ముగిసిన అండర్ 17 కబడ్డీ టోర్నమెంట్ గ్రామంలో నిర్వహించిన కబడ్డీ టోర్నమెంట్లో ఫైనల్ లో తలపడిన లక్ష్మీ సాగర్ తాండా మరియు పెద్ద రెడ్డిపేట టీంలు ఈ పోటీల్లో విజేతగా లక్ష్మీ సాగర్ తాండా. రన్నర్ గా పెద్దరెడ్డి పేట టీంలు ఈ పోటీల్లో నిలబడడం జరిగింది అని పుల్కల్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు తలారి అంజయ్య అన్నారు ఈ కార్యక్రమంలో పుల్కల్ మండలం కాంగ్రెస్ పార్టీఅధ్యక్షులు మల్లన్నగారి దుర్గురెడ్డి. ఉపాధ్యక్షులు తలారి అంజయ్య. సీనియర్ నాయకులు రామచంద్ర రెడ్డి.పెద్దగొల్ల సుభాష్ చెందర్ పి.లక్ష్మారెడ్డి గోవర్ధన్ మార్కెట్ కమిటి డైరెక్టర్ ఎర్రసింహ్మం రాజమల్లయ్య గంతి రాంచెంధర్. పెద్దగొల్ల శివచెంధర్. వివిధ గ్రామాల నుండి వచ్చిన కబడ్డి అటగాళ్ళు. అభిమానులు. తదితరులు పాల్గొన్నారు.