ప్రోఆర్చ్‌కు ఎఫ్‌టీసీసీఐ 2025 ప్రెసిడెంట్ డైమండ్ కప్

పయనించే సూర్యడు / డిసెంబర్ 30/ కాప్రా ప్రతినిధి సింగం రాజు ఎఫ్‌టీసీసీఐ 2025 ప్రెసిడెంట్ డైమండ్ కప్ ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్ అజీజ్‌నగర్‌లోని ది పావిలియన్ గ్రౌండ్స్‌లో ప్రోఆర్చ్, మ్యాక్రోమీడియా ఫ్యూజన్ లేవన్ జట్ల మధ్య ఉత్కంఠభరితంగా జరిగింది. టాస్ గెలిచిన ప్రోఆర్చ్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 166 పరుగులు సాధించింది. లక్ష్య ఛేదనలో మ్యాక్రోమీడియా ఫ్యూజన్ లేవన్ జట్టు ప్రోఆర్చ్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు తట్టుకోలేక 17.3 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ప్రోఆర్చ్ జట్టు ఎఫ్‌టీసీసీఐ 2025 ప్రెసిడెంట్ డైమండ్ కప్ ట్రోఫీని కైవసం చేసుకోగా, మ్యాక్రోమీడియా ఫ్యూజన్ లేవన్ జట్టు రన్నర్‌అప్‌గా నిలిచింది.