బాల్య వివాహ ముక్త్ భారత్ పై అవగాహన సదస్సు

★ డాక్టర్. బిఆర్ అంబేద్కర్ గురుకులం నందు ప్రిన్సిపాల్ జి. వి. లలిత కుమారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సీడీపీఓ పూర్ణిమ

పయనించే సూర్యుడు డిసెంబర్ : 30 జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జి కె సాయి దుర్గ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట బాల్య వివాహ్ ముక్త్ భారత్ 100 రోజుల కాంపెయిన్ లో భాగంగా స్థానిక గోకవరం రోడ్డులోని డాక్టర్. బిఆర్ అంబేద్కర్ గురుకులం నందు ప్రిన్సిపాల్ జి. వి. లలిత కుమారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి సీడీపీఓ పూర్ణిమ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.బాల్య వివాహ ముక్త భారత్ అనే కాంపెయిన్ 27 నవంబర్ 2025 నుండి 8 మార్చి 2026 వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. దేశంలో బాల్య వివాహా రహిత దేశంగా భారత దేశాన్ని తీర్చి దిద్దాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాలను విద్యా రంగ సంస్థలలో నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు. బాల్య వివాహ నిరోధ చట్టం 2006 ప్రకారం అమ్మాయికి 18 సంవత్సరాలు పూర్తి కాకుండా, అబ్బాయిలకు 21 సంవత్సరాలు నిండకుండా వివాహం చేయరాదని అన్నారు.బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం, నేరం అని తెలియజేసారు.బాల్య వివాహాలు నుండి బాలలను కాపాడాల్సిన బాధ్యత ప్రతీ పౌరుడు పై ఉందని అన్నారు. బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ , ప్రభుత్వ అధికారులకు తెలియ పరచాలని లేదా చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. మీ మహిళాభివృద్ధి , శిశు సంక్షేమ శాఖ చైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ బి శ్రీనివాసరావు బాల్య వివాహ ముక్త భారత్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ బి శ్రీనివాసరావు మాట్లాడుతూ బాల్య వివాహాలు నుండి బాలలను కాపాడాల్సిన బాధ్యత ప్రతీ పౌరుడు పై ఉందని అన్నారు. ప్రతీ ఒక్కరూ బాలలును స్నేహ పూరిత వాతావరణంలో తీర్చి దిద్దడంలో ప్రతీ ఒక్కరూ భాగ స్వామ్యం కావాలన్నారు. బాల్య వివాహాలు బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కలలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేయాలన్నారు. బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులకు తెలియపరచాలని లేదా చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్యానెల్ లీగల్ అడ్వాజర్ అప్పల్కొండ, మాట్లాడుతూ హై కోర్టు ఉత్తర్వులు ప్రకారం మరియు 7వ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ వారు ఆదేశాలు మేరకు 100 రోజులు కాంపెయిన్ లో బాల్య వివాహ రహిత దేశంగా తీర్చి దిద్దాలనే దృక్పధంతో ఈ అవగాహన కార్యక్రమాలును సంబంధిత శాఖలు మరియు మీరందరూ చాలా డిస్ప్లేన్ గా ఉండాలి ఓకేనా అన్నిసార్లు అనిపించుకుంటారు పోక్సో చట్టం ప్రకారం కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేసారు. బాలల విద్య మరియు భద్రత కోసం ప్రతీ పౌరుడు గళాన్ని వినిపించాలని మరియు బాల్య వివాహ ఆంధ్రప్రదేశ్ సాకారానికి మద్దతు ఇవ్వాలని అన్నారు .అందులో బాగంగానే ఈరోజు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ మరియు మానవ హారం చేయడం జరిగిందని తెలియజేశారు . ఎక్కడైనా బాల్య వివాహాలు జరుతున్నట్లు సమాచారం తెలిసిన లేదా జరుగుతున్నట్లు చూసిన చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 కి ఉమెన్ హెల్ప్ లైన్ 181,పోలీస్ డయల్ 112 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని తెలియజేసారు.ఈ కార్యక్రమములో పారాలీగల్ వాలంటీర్నూ తలపాటి అప్పలకొండ,యన్ శ్రీ హర్శ , ప్రిన్సిపాల్ జి. వి. లలిత కుమారి, సూపరవైజర్ సునీత, అమ్మాజీ ఉపాధ్యాయులు, విద్యార్థిని లు పాల్గొన్నారు.