పయనించే సూర్యుడు డిసెంబర్ 30, కాకినాడ జిల్లా ప్రతినిధి కాకినాడ రూరల్ (బి వి బి) శ్రీ రాజ్యలక్ష్మి సమేత భవన్ నారాయణ స్వామి ఆలయంలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతుందని అన్నారు ఆదివారం ఉదయం కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామం శ్రీ రాజ్యలక్ష్మి సమేత భవన్ నారాయణ స్వామి ఆలయంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభం చేశారు అందులో భాగంగా టిక్కెట్ల కౌంటర్, స్వామివారికి సేద తీర్చే ఉయ్యాల, గోసాల, కార్యదర్శి కార్యాలయం మరియు ఆలయ గంట లను లాంఛనంగా ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన్ నారాయణ స్వామి ఆలయ కీర్తిని దేశమంతటా వ్యాప్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే భవన్నారాయణ స్వామి ఆలయ భూములు అన్యాక్రాంతం అవ్వకుండా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఆలయ ఏవన్ గ్రేడ్ కార్యదర్శి రాపాక శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనసేన నాయకులు పుల్లా శ్రీరాములు, అధ్యక్షతన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనంతలక్ష్మి త్రిమూర్తులు, మామిడాల శ్రీనివాసరావు, పుల్లా రాజబాబు, గ్రామ కార్యదర్శి శ్రీనివాస్, జనసేన నాయకులు పాండ్రంకి రాజు తదితరులు జనసైనికులు గ్రామస్తులు పాల్గొన్నారు.