మత్తుకు బానిస కావద్దు. రాష్ట్ర మాజీ మంత్రి శివాజీ

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 30 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరుతూ, పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు నిర్వహిస్తున్న అభ్యుదయ సైకిల్ యాత్ర సోమవారం హరిపురం బాలిగాం జంక్షన్ కు చేరుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పలాస మాజీ శాసన సభ్యుడు గౌతు శ్యామ సుందర శివాజీ హాజరయ్యారు. ఈ ర్యాలీ పలాస నియోజకవర్గం మందస మండలం బాలిగాం గ్రామ పంచాయతీ కొర్రాయి గేటు నుండి హరిపురం పెట్రోల్ బంక్ వరకు వేలాదిమంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు .“అభ్యుదయం సైకిల్ యాత్ర – డ్రగ్స్ వద్దు బ్రో” కార్యక్రమం లో గౌతు శివాజీ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే భవిష్యత్ ప్రమాదాలపై అవగాహన కల్పించి మత్తు పదార్థాలకు జోలికి పోకుండా, మంచి జీవనశైలిని ప్రతి ఒక్కరూ పొందాలని ఆకాంక్షించారు. సమాజంలో డ్రగ్స్ ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా ముందుకు రావాలని, యువతకు సరైన మార్గనిర్దేశం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. సైకిల్ యాత్ర రూపంలో ఇలాంటి మంచి కార్యక్రమం రూపొందించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోం మంత్రి వంగలపూడి అనిత కు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పెద్దలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డ్రగ్స్ వద్దు బ్రో అంటూ విద్యార్థులు ఫ్లకార్డులతో ర్యాలీలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, కార్యకర్తలు, కాశీబుగ్గ డిఎస్పి షేక్ సహబజ్ అహ్మద్, సిఐ తిరుపతి రావు , ఎస్సై కృష్ణ ప్రసాద్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.