పయనించే సూర్యుడు న్యూస్ 30 డిసెంబర్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ రిపోర్టర్ మొలుగు సంజీవ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీలో మరెన్నో అభివృద్ధి పనులు చేసిన మాజీ సర్పంచుల బాధలు వర్ణనాతీతమని తెలంగాణ సర్పంచుల సంఘం మాజీ ఉపాధ్యక్షులు, రాయపోలు గ్రామ మాజీ సర్పంచ్ గంగిరెడ్డి బలవంత్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బలవంత్ రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ వద్ద న్యాయం కోసం వెళ్తుంటే మార్గ మధ్యలో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని తెలిపారు. సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేస్తామని హెచ్చరించారు.