
పయనించే సూర్యుడు డిసెంబర్ 30 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) మారక ద్రవ్య వినియోగం దేశ ప్రగతి కీ విఘతం అని పలువురు వక్తలు అన్నారు.స్థానిక వాసవి మహల్ నందు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మత్తు పదార్తాల వ్యతిరేక అవగాహనా సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సు లో లో బాయ్స్ హై స్కూల్ విద్యార్థులు శ్రీ కృష్ణదేవరాయ జూనియర్ కళాశాల ఎస్పీవీఎం డిగ్రీ కళాశాల విద్యార్థులు, ఎస్ ఏ పీ ఎస్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఏ ఎన్ కె డిగ్రీ కళాశాల విద్యార్థులు మరియు ఐటిఐ కళాశాల విద్యార్థులతో పాల్గొన్నారు. తొలుత బస్టాండ్ సర్కిల్ నందు మానవహారం ఏర్పాటు చేసి అక్కడ నుండి వాసవి మహల్ వరకు ర్యాలీగా డ్రగ్స్ వద్దు జీవితం ముద్దు, మాధకద్రావ్యాలు మత్తు వ్యాసనాలు, మత్తు తో చేసుకోకండి జీవితాన్ని చిత్తు, మాధాకద్రవ్యాల వినియోగం దేశ ప్రగతికి విఘాతం అని నినాదాలు ఇచ్చారు. రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ జిఎం .సురేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమం కీ ముఖ్య అతిథిగా డీఎస్పీ నరసింగప్ప హాజరయ్యారు క్రియేటర్ కృష్ణ, ఈగల్ టీమ్ ఎస్సై శ్రీహరి, రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ భక్తవత్సలం, చిలమత్తూర్ విద్యాశాఖ అధికారి సల్మాన్ రాజు, జగదీశ్ టీచర్ అతిథులుగా హాజరయ్యారు. సురేష్ మాట్లాడుతు యువత మత్తు పదార్తాల జోలికి వెళ్లకుండా జీవితాన్ని బంగారుమయం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ,విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టి చదివి ఉన్నత స్థాణాలను అధిరోహించాలని డి.ఎస్.పి నరసింగప్ప విద్యార్థులకు సూచించారు. అలాగే ఎక్కడయినా మాదకద్రవ్యాలు ఎవరయినా వాడుతున్నట్టు తెలిసినా లేక అమ్ముతున్నట్లు తెలిసినా 1972 నెంబర్ కు తెలియజేయాలని కోరారు. డ్రగ్స్ వినియోగిస్తూ పట్టుబడినా అమ్ముతూ పట్టుబడినా చట్టాలు చాలా కఠినంగా ఉంటాయాన్ని అలాగే బాల్యవివాహాలు నేరమని ఒకవేళ ఆలా ఎవరయినా చేస్తుంటే సమాచారమైవ్వాలని ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా కానీ లేదా 1972 నెంబర్ కి గానీ తెలియజేయాలని తెలిపారు. మోటివేషనల్ స్పీకర్ క్రియేటర్ కృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు పైనా మెరుగులు, హంగులు ఆర్బాటాలు కాకుండా తల్లిదండ్రులు మీపై ఉంచుకున్న ఆశలను ఆశయాలను నెరవేర్చే విధంగా కష్ఠపడి కాకుండా ఇష్టపడి చదివి మంచి ఉన్నత స్థానాలను చేరుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం అక్కడికి వచ్చిన వారందరితో మత్తు పదార్తాలు, ఆల్కహాల్, పోగాకు, గంజాయి వంటి వాటి జోలికి వెళ్లనని తల్లిదండ్రులు మాపై ఉంచుకున్న ఆశలను నెరవేరుస్తామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అన్ని కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, శివప్ప నాయక్, రామాంజనేయులు, అజాద్, అరవింద్, బాల మోహన్, సుధాకర్, బాబు, నరసింహులు, ఆదినారాయణ, ఫక్కిర్ నాయక్, అజీమ్ బాషా, ఆర్యవైశ్య పెద్దలు బలరాం గుప్తా, నందగోపాల్ గుప్తా, కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులు శివ ప్రకాష్, నంజుండ, నరేష్ రెడ్ క్రాస్ సొసైటీ కోఆర్డినేటర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.