పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్ టి ఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం డిసెంబర్ 30 జగ్గయ్యపేట మండలము తిరుమలగిరి గ్రామములో వేంచేసియున్న శ్రీ ఎన్ టి ఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలము తిరుమలగిరి గ్రామములో వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము నందు ది. 30. 12. 2025 వ తేదీన ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని ఉదయం గం 6. 00 ని. ల నుండి ఉత్తర ద్వార దర్శనం కల్పించబడును. ముక్కోటి ఏకాదశి సందర్భముగా శంఖు తీర్ధము అందించబడును. కావున యావన్మంది భక్తులు శ్రీ స్వామి వారిని దర్శించి తీర్ధప్రసాదములు స్వీకరించి వైకుంఠ ఏకాదశి పర్వదినమున శ్రీ స్వామి వారి కృపకి పాత్రులు కాగలరు. అనంతరం ఉదయం 9 గం.ల నుండి శ్రీ స్వామి వారి గ్రామోత్సవం నిర్వహించబడును అని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ.కె రవీంద్ర భరద్వాజ్, ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి వారు తెలియజేసియున్నారు. భరద్వాజ్, ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి నూతక్కి సాంబశివరావు తెలియజేసియున్నారు.
