
పయనించే సూర్యుడు న్యూస్ : డిసెంబర్ 30, తల్లాడ రిపోర్టర్ వ్యవసాయ అధికారి తాజుద్దీన్ హామీతో శాంతించిన అన్నదాతలు రబీ సీజన్ కు యూరియా కావాల్సిన అన్నదాతలు సోమవారం తల్లాడ వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళన నిర్వహించారు. యూరియా లేక పంటలు సాగు చేయలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నుండి ఎటువంటి హామీ ఇవ్వకపోవడంతో అన్నదాతలు తల్లాడలోని ప్రధాన రహదారి వద్ద రాస్తారోకో చేపట్టారు. యూరియా లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని, పంటలు చేతికొచ్చే పరిస్థితి లేదని తక్షణమే యూరియాను తెప్పించాలని డిమాండ్ చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న తల్లాడ వ్యవసాయ అధికారి ఎండి తాజు ద్దీన్ ఉన్నతాధికారులతో మాట్లాడి యూరియాను రైతులందరికీ అందే విధంగా తెప్పిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన రాస్తారోకోను విరమించారు. ఈ కార్యక్రమంలో తల్లాడ మండలానికి చెందిన రైతులు పాల్గొన్నారు.
