రాబోయే ఎన్నికలలో బీసీలకేబీసీ సీట్లు కేటాయించాలి: బిసినేత రాష్ట్ర అధ్యక్షులు బేరిరామచంద్ర యాదవ్.

పయనించే సూర్యుడు, డిసెంబర్ 30 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార్) కాంగ్రెస్ పార్టీ టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు వినతి పత్రం అందించిన భేరి రామచంద్ర యాదవ్ దామాషా పద్ధ తిలో బీసీలకు వాటాతో పాటు రాబోయే ఎన్నికలలో బీసీలకే బీసీ సీట్లు కేటాయించాలి బిసి నేత రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ రాబోయే ఎంపిటిసి జెడ్పిటిసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ కౌన్సిలర్స్ చైర్మన్లు బీసీలకు ఎన్నికలలో దామాషా ప్రకారం గ్రామీణ పట్టణ స్థాయిలో బీసీలకే సీట్లు కేటా యించాలని. ఎక్కువ జనాభా ఉన్న బీసీలకే పట్టం కట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్రర్ యాదవ్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు వినతిపత్రం సమర్పించా రు. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ బీసీ వాట కోసం ఎన్నికల లో బీసీలకే సీట్లు వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఇలాంటి విషయాలను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువ స్తానని ఆయన హామీ ఇచ్చారు.. ఈ సందర్భంగా బేరి సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనను సన్మానించారు. కార్యక్రమం లో ఉస్మానియా విద్యార్థి సంఘం నాయ కులు నిరంజన్ యాదవ్, సందీప్ యాదవ్, కృష్ణ గౌడ్, రమేష్ ముదిరాజ్, పద్మశాలి సంఘం అశోక్, నాయి బ్రాహ్మణ సంఘం సాయిలు, రజక సంఘం కిషోర్, లెనిన్ యాదవ్, శశాంక్ యాదవ్, క్రాంతి కుమార్, సంతోష్ కుమార్, సంపత్ కుమార్ యాదవ్, యాదవ్ సంఘం బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.