
పయనించే సూర్యుడు డిసెంబర్ 30, కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలుపడానికి పెద్ద హరివానం మండలం అన్ని గ్రామ ప్రజలతో మన నాయకుడు రైతుబిడ్డ ప్రజల్లో ఉంటూ ప్రజల శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అర్పించడానికి రెడీగా ఉన్నా నాయకుడు అలాగే రాజకీయాల్లో కూడా అంచుల అంచులుగా ఎదిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప ప్రజలతో కలిసి జన సాగరం తో కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపడానికి ఆదోనిలో దాదాపు 5 వేల మంది ప్రజలతో యువకులతో రైతులతో రాజకీయ నాయకులతో మరియు మహిళలతో కలిసి ఆదోనిలో గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపినారు ఈ సందర్భంలో చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదోని ప్రజల కష్టాలను గుర్తించి ఆదోని మండలంలో అతి పెద్ద గ్రామమైన పెద్ద హరివాణం గ్రామాన్ని పెద్ద హరివాణం మండలంగా ప్రకటించి చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకు అనుగుణంగా అన్ని సౌకర్యాలతో కలుగుతుందని ప్రజలకు అన్ని పనులు గ్రామం దగ్గరలో ఉన్న పెద్ద హరివాణం మండలం అన్ని విధాలుగా సౌకర్యంగా ఉంటుందని ప్రజలకు చెప్పడం జరిగినది.