
పయనించే సూర్యుడు డిసెంబర్ 30, ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. ఆదోని సట్టా బజార్ నందు సిఐటియు అధ్యక్షులుపట్టణ పీఎస్ గోపాల అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కార్మికుల ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దివాకర్ కోశాధికారి ఎం గోపాల్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి రామాంజనేయులు తెలుగు ఏపీ ఆటో ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కే ప్రభాకర్ . పట్టణ కార్యదర్శి తిప్పన్న సాయి కార్యదర్శి లక్ష్మన్న మండల అధ్యక్ష కార్యదర్శులు జెరామాంజనేయులు వీరారెడ్డి వీరు మాట్లాడుతూ, స్వాతంత్రం తరువాత కార్మిక వర్గం ఎన్నడూ లేని విధంగా తీవ్రమైన కష్టాలు ఎదుర్కొంటున్నారని కార్మికుల కష్టాలు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుండా కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేయడానికి కార్మికులు పోరాడి సాధించుకున్న 29 రకాల చట్టాలను నియంత్రిత్వ ధోరణితో రద్దు చేయడం జరిగింది. కార్మికులకు ఎంతో మేలు చేస్తుందని నాలుగు లేబర్ కోడ్లు తెచ్చిందని నవంబర్ 21 నుండి రాష్ట్ర ప్రభుత్వాలపై అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నది 8 గంటల పని విధానం రద్దు సమ్మే హక్కు రద్దు కనీస వేతన హక్కు చట్టం సామాజిక భద్రత చట్టం తదితర చట్టాల్లో కార్మిక వర్గాన్ని బానిసలుగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకున్నదని తెలిపారు. ఈ లేబర్ చట్టాల వల్ల వేతనాలు పెంచకుండా కాంట్రాక్ట్ కార్మికులను గౌరవితన కార్మికులను రెగ్యులర్ చేయకుండా పని గంటల పెంపు తదితర కార్మికులపై గుద్ది పండగ మారుతున్న లేబర్ చట్టాలను రద్దుకై విశాఖ మహాసభలో ఐదు రోజులు జరుగుతాయని నాలుగో తేదీ బహిరంగ సభ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ గ్రైన్స్ హమాలీలు దస్తగిరి నీలకంఠ ఈరప్ప ఎల్లప్ప ఆటో హనుమంతు గోపాల్ ఆర్టీసీ అజీమ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.