సిరిసేడు ప్రభుత్వ పాఠశాలలో రూ.2 లక్షల వ్యయంతో బాత్రూమ్స్ ప్రారంభం

★ మిన్నెసోటా ఏరియా తెలంగాణ అసోసియేషన్ సౌజన్యం – విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు

పయనించే సూర్యుడు/ డిసెంబర్ 30/ దిడ్డి రాము/ జమ్మికుంట రూరల్; మిన్నెసోటా ఏరియా తెలంగాణ అసోసియేషన్ సౌజన్యంతో సిరిసేడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం రూ.2 లక్షల వ్యయంతో నిర్మించిన బాత్రూమ్స్‌ను కటంగూరి అంజలిదేవి రెడ్డి, గ్రామ సర్పంచ్ శ్యామల కుమార్, మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) రాములు నాయక్‌లు శుక్రవారం ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలకు మిన్నెసోటా ఏరియా తెలంగాణ అసోసియేషన్ తరఫున పూర్తి సహకారం అందిస్తామని ఆయన తెలిపారు. బాత్రూమ్ నిర్మాణ పనులను అత్యంత శ్రద్ధతో దగ్గరుండి పర్యవేక్షించి పూర్తిచేసిన పాఠశాల హెడ్‌మాస్టర్ జగదీశ్వర్, ప్రభాకర్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగ రామకృష్ణలకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమానికి సహకరించిన మిన్నెసోటా ఏరియా తెలంగాణ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కటంగూరి విక్రాంత్ రెడ్డికి గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు బొమ్మెడి తిరుపతి, చింటూ, రాజయ్య, రేణుకుంట్ల రాములు, ఎజ్జు శ్రీను, కార్యదర్శి శ్రీనివాస్, గొట్టే శేఖర్ తదితరులు పాల్గొన్నారు.