పయనించే సూర్యుడు డిసెంబర్ 30, కాకినాడ జిల్లా ప్రతినిధి కాకినాడ రూరల్ (బి వి బి) సూర్య బలిజ సంక్షేమ సంఘం అభివృద్ధికి ప్రభుత్వ పరంగా వచ్చే నిధులు రాజకీయపరంగా వచ్చే అధికారాలకు సంయుక్తంగా అందరూ ముందుకు వెళ్లాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంక్షేమ సంఘం జనరల్ సెక్రెటరీ జీవీకే మోహన్ రావు పేర్కొన్నారు. కాకినాడ జగన్నాధపురం వద్ద సూరి బలిజ సంక్షేమ సంఘం కాకినాడ అధ్యక్షులు కోటిపల్లి నాగేంద్రుడు ఆధ్వర్యంలో సంఘ సమావేశ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మోహన్ రావు మాట్లాడుతూ సూర్య బలిజ కులానికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు. తెలుసుకోవడానికి సంఘం ద్వారా కులగలను వెబ్సైటును జిల్లా అధ్యక్షుడు ఏలూరు సుబ్రహ్మణ్యం ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కృష్ణ సాయి, కాళీ సతీష్, శ్యాంసుందర్, చల్ల కొండ నాగబాబు, మరమల్ల ప్రసాద్, జీవి రామారావు, వాల్మీకి (త్రిమూర్తులు) తదితరులు పాల్గొన్నారు.