పయనించే సూర్యుడు డిసెంబర్ 30 శింగనమల శింగనమల మండల నదీ పరీవాహక ప్రాంతంలో వంకలు, వాగులు దేన్నీ వదలకుండా ఇసుక మాఫియా పెట్రేగిపోతోంది తద్వారా ప్రజలకు నీరు లేక జీవనాధారం దెబ్బతింటోంది. అధినాయకుల అండదండలతో నాయకులు కల్లుమడి ,తరిమల, నిదానవాడ, తదితర ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణా చేస్తూ రోజుకు లక్షల్లో దండుకుంటున్నారు. అసలే కరువు జిల్లా అయిన అనంతలో వర్షపాతం తక్కువ అనే విషయం దేశవ్యాప్తంగా తెలిసిందే అయితే ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు నది పారితే వంకలు, వాగుల్లో ఉన్న ఇసుక మేటలు భూగర్భ జలాలను దాచుకొని ఎండకాలం సైతం భూమిలో నీటిమట్టం తగ్గకుండా రైతుల బోర్లలో సమృద్ధిగా నీరు అందించి పంటలు పండించుకొని జీవనాధారం సాగించుటకు దోహదపడుతుంది. అయితే అక్రమ దనార్జనకు పాల్పడుతున్న కొందరి ధన దాహార్తికి బలైపోతూ జెసిబి, ఇటాచ్చి లు పెట్టి టిప్పర్లలో,ట్రాక్టర్ లకు ఇసుక నింపుతూ అక్రమంగా తరలిస్తున్న ఇసుకాసురుల ముందు నిచ్చే స్టురాలై తనను నమ్ముకున్న రైతు బిడ్డలకు ఏమి చేయలేక నేలతల్లి తనను ఆదుకునే ఉన్నతాధికారుల కోసం వేచి చూస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అక్రమ ఇసుక రవాణాను అడ్డుకొని రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భూగర్భ గనుల శాఖ చోద్యం చూస్తోంది. పోలీసు అధికారులు సహకరిస్తున్నారా అనే విధంగా ప్రజలు చెవులు కోరుకుంటున్నారు. ఒకవేళ పట్టుకున్నప్పటికీ తూతూ మంత్రంగా ఫైన్ వేసి ఏదేచ్ఛగా ఇసుక రవాణా చేసుకోమన్నట్టుగా లోపాయి కారి ఒప్పందం చేసుకున్నట్టుగా ప్రజల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇక స్థానిక రెవిన్యూ శాఖ తనకేం ఎరుగునట్టు చోద్యం చూస్తోంది. అయితే నానాటికి ప్రజల్లో చైతన్యం పెరిగి ప్రజా ప్రయోజనాలకు విఘాతం కల్పించే పెద్ద పెద్ద నాయకులను సైతం ఎలక్షన్లలో తమ ఓటు ప్రభావంతో మట్టుపెట్టిన దాఖలాలు చాలానే ఉన్నాయి. కానీ రానున్న స్థానిక ఎన్నికల్లో ఇసుక దందా కొనసాగిస్తున్న ఇసుకాసురుల వల్ల తెదేపా సైతం భారీగా నష్టపోయే అవకాశం ఉంది.ఇటీవలే నిదనవాడ గ్రామ ప్రజలు ఇసుకాశురాలను అడ్డుకున్న విషయం తెలిసిందే.ప్రజలు మరింత చైతన్య వంతులై మరిన్ని చోట్ల అడ్డుకోక ముందే అధికారులు అప్రమత్తమై చర్యలు తీసుకుంటే అధికారులకు పరువైనా దక్కుతుంది.