పయనించే సూర్యుడు ప్రతినిధి ప్రత్తిపాడు నియోజవర్గం ఇంచార్జ్ ఎం. రాజశేఖర్,డిసెంబర్, 31: డిసెంబర్ 31 రాత్రి జరుగు నూతన సంవత్సర వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతిష్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టినట్లు ఏలేశ్వరం ఎస్ ఐ ఎన్.రామలింగేశ్వర రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా యువత అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు. రాత్రి 11 దాటిన తర్వాత ఎవరు కూడా రోడ్లపై తిరగరాదని ఆయన హెచ్చరించారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకునే ముందు పక్క వారికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఆయన సూచించారు.