ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి సందడి

పయనించే సూర్యుడు డిసెంబర్ 31 పాపన్నపేట మండలం రిపోర్టర్ దుర్గాప్రసాద్ ఉదయం నుండి ఆలయాల్లో అధ్యాత్మిక సందడి నెలకొంది. మంగళవారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మల్లంపేట హరిహర క్షేత్రంలో కొలువైన శ్రీ సీతారామ చంద్రస్వామి,పాపన్నపేట పాతూరు లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో దేవత మూర్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు శివ శ్రీ శివ శాస్త్రి,విశ్వనాథ శర్మ లు విశేష పూజలు నిర్వహించారు. ఉత్తర ద్వార పాలక పూజ అనంతరం స్వామి వారిని ఉత్తర ద్వారం గుండా భక్తులు దర్శించుకున్నారు. ఈసందర్బంగా పాపన్నపేట మాజీ ఎంపీపీ చందన ప్రశాంత్ రెడ్డి,మల్లంపేట సర్పంచ్ పుట్టి పద్మ రమేష్,పాపన్నపేట సర్పంచ్ పావని నరేందర్ గౌడ్,నాయకులు తదితరులు పాల్గొన్నారు.