పయనించే సూర్యుడు న్యూస్ : డిసెంబర్ 31, తల్లాడ రిపోర్టర్ తల్లాడ స్థానిక సిపిఎం ఆఫీసులో నల్లమోతు మోహన్ రావు అధ్యక్షతన పార్టీ మండల కమిటీ శాఖ కార్యదర్శులు సమావేశం జరిగింది ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదినేని రమేష్ మాట్లాడుతూ యూపీఏ వన్ ప్రభుత్వంలో సిపిఎం అనేక పోరాటాల ఫలితంగా మంత్రి పదవులను సైతం వదులుకొని వ్యవసాయ కూలీలు పేద ప్రజలకు పని భద్రత కోసం 2006లో ఉపాధి హామీ చట్టం ఎంజిఎన్ఆర్ఇజిఎస్ వచ్చిందని నేటి బిజెపి ప్రభుత్వం అనేక పోరాటాల ఫలితంగా వచ్చిన చట్టం ఫలాల్ని పేద ప్రజలకు అందకుండా దూరం చేసే దుర్మార్గ వైఖరిని అవలంబించి నిధులు తగ్గించుకుంటూ వచ్చి వ్యవసాయ కూలీలను కార్పొరేటర్లకు బానిసలుగా చేసే ఉద్దేశంతో వి బి జి రాంజీ బిల్లును తీసుకొచ్చిందని ఈ బిల్లును వెంటనే రద్దు చేయాలని లేని పక్షంలో పేద ప్రజలందరినీ సమీకరించి ఎర్రజెండా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేసి సాధించుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ సమావేశంలో పార్టీ డివిజన్ కార్యదర్శి సేలం సత్యనారాయణ రెడ్డి మండల కార్యదర్శి అయినాల రామలింగేశ్వర రావు పులి కృష్ణయ్య కళ్యాణ కృష్ణయ్య సేలం పకీరమ్మ సత్తెనపల్లి నరేష్ చల్లా నాగేశ్వరరావు ఆదోని జీవరత్నం కట్ట దర్గయ్య మేడి బిక్షం గండమాల ఆనందరావు కృష్ణయ్య పులి వెంకట నరసయ్య పారసాని వెంకటయ్య సోదా హనుమంతరావు ఆదూరి యాకోబు తదితరులు పాల్గొన్నారు