ఎం సి హెచ్ హాస్పిటల్ లో పండ్లు పంపిణీ చేసిన బిజెపి మహిళలు

పయనించే సూర్యుడు డిసెంబర్ 31డివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి, పుట్టినరోజు సందర్భంగా ఆదోని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా విభాగం ఆధ్వర్యంలో స్త్రీలు చిన్నపిల్లల హాస్పిటల్ లో పేషెంట్లకు, బాలింతలు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మహిళా మోర్చా సభ్యులు మాట్లాడుతూ ఎమ్మెల్యే పార్థసారథి, ఆదోని నియోజకవర్గ ప్రజలందరికీ సేవ చేస్తూ, నియోజకవర్గాన్ని అభివృద్ధి చెసే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని. కోరుకుంటున్నామని తెలిపారు.ఈ కార్యక్రమములో కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ, కౌన్సిలర్ గొల్ల పద్మావతి, మహిళా మోర్చా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు వినీతాగుప్త, రత్నా బాయ్ మార్కెట్ యార్డు డైరెక్టర్, జయలక్ష్మి, మొదలైన పాల్గొన్నారు..